road accident in hyderabad | రోడ్డు ప్రమాదంలో పాఠశాల విద్యార్థిని దుర్మరణం

హబ్సిగూడలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాఠశాలకు వెలుతున్న విద్యార్థిని మృతి చెందిన ఘటన విషాదం రేపింది. వెనుక నుంచి వచ్చిన కంటెయినర్ స్కూల్ విద్యార్థులతో వెలుతున్న ఆటోను ఢీ కొట్టడంతో ఆటో ముందున్న ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లింది.

  • By: Subbu |    telangana |    Published on : Aug 17, 2024 1:46 PM IST
road accident in hyderabad | రోడ్డు ప్రమాదంలో పాఠశాల విద్యార్థిని దుర్మరణం

విధాత, హైదరాబాద్ : హబ్సిగూడలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాఠశాలకు వెలుతున్న విద్యార్థిని మృతి చెందిన ఘటన విషాదం రేపింది. వెనుక నుంచి వచ్చిన కంటెయినర్ స్కూల్ విద్యార్థులతో వెలుతున్న ఆటోను ఢీ కొట్టడంతో ఆటో ముందున్న ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న సాత్విక(15) అనే విద్యార్థినికి తీవ్ర గాయాలు కాగా.. నాచారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. ఆటో డ్రైవర్ ఎల్లయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.. పోలీసులు క్రేన్ సహాయంతో బస్సు కిందకు దూసుకెళ్లిన ఆటోను తొలగించారు. సాత్విక హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.