Hyderabad | హైదరాబాద్‌లో మరో దారుణం.. మహిళను బంధించి అత్యాచారం

హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. సంతోష్ చైతన్య అనే వ్యక్తి బేగంపేటలోని తన ఫ్లాట్‌లో తోటి మహిళా ఉద్యోగినిని బంధించి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది

Hyderabad | హైదరాబాద్‌లో మరో దారుణం.. మహిళను బంధించి అత్యాచారం

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. సంతోష్ చైతన్య అనే వ్యక్తి బేగంపేటలోని తన ఫ్లాట్‌లో తోటి మహిళా ఉద్యోగినిని బంధించి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాకి చెందిన ఓ మహిళ ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చింది. అయితే సదరు మహిళకు ఉండటానికి ఫ్లాట్ లేకపోవడంతో తోటి ఉద్యోగి అయిన సంతోష్ తనకు ఇల్లు వెతకడానికి సాయం చేస్తానని, అంతలోపు తన వాళ్ల ఇంట్లో ఉండాలని తనతో పాటు తల్లి, చెల్లి కూడా ఉంటారని నమ్మించి ఇంటికి తీసుకు వెళ్లాడు.

ఇంటికి వెళ్లిన అనంతరం ఇంట్లో ఎవరూ లేకపోవటాన్ని గమనించిన మహిళ అతన్ని ప్రశ్నించగా అతడు ఆమెను బలవంతంగా ఒక రూమ్‌లో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన మోసాన్ని గ్రహించిన బాధిత మహిళ గోల చేయగా, తనని పెళ్లి చేసుకుంటానని నిందితుడు నమ్మించాడు. అయితే కొన్ని రోజులకు మహిళను రూమ్ నుంచి విడుదల చేశాడు. బాధిత మహిళ ఎన్ని సార్లు ఫోన్ చేసినా సంతోష్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె పోలీసులని ఆశ్రయించి అతనిపై కేసు పెట్టింది.