Cm Revanth Reddy | హైదారాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం
: తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి విదేశీ పెట్టుబడుల సాధన లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం రాష్ట్రానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డి బృందానికి మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి విదేశీ పెట్టుబడుల సాధన లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం రాష్ట్రానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డి బృందానికి మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. తనకు లభించిన ఘన స్వాగతంపై సీఎం రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మన బిడ్డల కొలువుల కోసం, మన రాష్ట్రానికి పరిశ్రమల కోసం, ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ బ్రాండింగ్ కోసం, అమెరికా, దక్షిణ కొరియాలలో పర్యటించడం జరిగిందన్నారు. ఈ పర్యటన పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఇవాళ సాయంత్రం కోకాపేటలో కాగ్నిజెంట్ నూతన క్యాంపస్ ను సీఎం ప్రారంభించనున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 3న మంత్రులు, అధికారుల బృందంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు. అమెరికా, దక్షిణ కొరియాలలోని పలు కంపనీల ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూలు కుదుర్చుకున్నారు. మొత్తం 19 కంపెనీలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుని సుమారు రూ.31,532 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించడం జరిగిందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
అధునాతన గ్రీన్ సిటీకీ మద్దతు: శ్రీధర్ బాబు
అధునాతనమైన గ్రీన్ సిటీగా ముచ్చర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తున్నదని ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా, దక్షిణకోరియా సంస్థలు ఆసక్తిని, ఉత్సహాన్ని చూపించాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాబోయే కాలంలో ఫోర్త్ సిటీగా ప్రత్యేక నగరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచనను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు, పారిశ్రామికలవేత్తల ముందు ఉంచామని, వారంతా ఆసక్తిని వ్యక్తం చేశారన్నారు.