ఏనుగు దాడిలో మరో రైతు మృతి
విధాత: కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో 24గంటల వ్యవధిలో ఏనుగు మరో రైతును చంపివేసింది. పెంచికల్ పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోచయ్య(50)అనే రైతు గురువారం ఉదయం కరెంటు మోటర్ వేయడానికి పొలానికి వెళ్తుండగా ఏనుగు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిన్న బుధవారం చింతలమానపల్లి మండలం బూరెపల్లి గ్రామానికి చెందిన అల్లూరి శంకర్ అనే రైతు మిర్చి తోటలో పనిచేస్తుండగా ఏనుగు దాడి చేయడంతో మృతి చెందాడు. ఆ సంఘటన మరువకముందే మరో రైతు ఏనుగు దాడిలో మృతి చెందారు.
సిర్పూర్ నియోజకవర్గంలో 24 గంటల వ్యవధి లోనే ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందడంతో సమీప గ్రామాల్లోని ప్రజలు రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. మహారాష్ట్ర సరిహద్దు వైపు మంద నుంచి తప్పిపోయి ప్రాణహిత నది దాటి తెలంగాణ వచ్చిన ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందడంతో సమీప గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలను బయటకు రావద్దని పంట పొలాలకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. గ్రామాల్లో ఏనుగు సంచారం పై అప్రమత్తంగా ఉండాలంటూ డప్పు చాటింపులు వేయిస్తున్నారు. అటవీ అధికారులు ఏనుగుని బంధించడమా లేక దారి మళ్లించి తిరిగి మహారాష్ట్ర వైపు పంపించడం పై చర్యలు తీసుకుంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram