Nizamabad | వ్యాయామం చేస్తూ గుండెపోటుతో ఏఎస్‌ఐ మృతి

ఇటీవల గుండెపోటు (Heart Attack) మరణాల సంఖ్య పెరుగుతున్న క్రమం ప్రజలను కలవర పెడుతుంది. బుధవారం నిజామాబాద్‌లో ఇంట్లో వ్యాయామం చేస్తున్న ఏఎస్ఐ దత్తాద్రి (56) (ASI Dattadri) గుండెపోటుతో మృతిచెందారు

Nizamabad | వ్యాయామం చేస్తూ గుండెపోటుతో ఏఎస్‌ఐ మృతి

Nizamabad | ఇటీవల గుండెపోటు (Heart Attack) మరణాల సంఖ్య పెరుగుతున్న క్రమం ప్రజలను కలవర పెడుతుంది. బుధవారం నిజామాబాద్‌లో ఇంట్లో వ్యాయామం చేస్తున్న ఏఎస్ఐ దత్తాద్రి (56) (ASI Dattadri) గుండెపోటుతో మృతిచెందారు. నిజామాబాద్ వన్ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న దత్తాద్రి ఉదయం ఇంట్లో వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలింంచేలోగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దత్తాద్రి గత రెండేళ్లుగా నిజామాబాద్ వన్ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్‌కు చెందిన ఆయన.. గత 20 ఏళ్లుగా నిజామాబాద్‌లోని గాయత్రి నగర్‌లో నివాసముంటున్నారు. దత్తాద్రి ఆకస్మిక మరణం కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది