విధాత, హైదరాబాద్ : మాది పీపుల్స్ సెంట్రిక్ బడ్జెట్ అని తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 2026-27 బడ్జెట్ ను అసెంబ్లీ ప్రవేశ పెట్టిన అనంతరం ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడు. ప్రజలే కేంద్రంగా బడ్జెట్ ప్రవేశపెట్టాం అని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఎలాంటి వివక్ష లేకుండా బీమా సౌకర్యం కల్పించాం అని తెలిపారు. ఉద్యోగులు అందరికీ కోటి రూపాయల బీమా కల్పించాం అని గుర్తు చేశారు.
వాస్తవిక బడ్జెట్ కాబట్టే ఇక్కడితో ఆగాం అని, బీఆర్ఎస్ లాగా అంకెల గారడి చేసి ఉంటే 3లక్షల 30వేల నుంచి 80 వేల కోట్ల వరకు బడ్జెట్ వెళ్లేది అని వ్యాఖ్యానించారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. అంబేడ్కర్ అడుగుజాడల్లోనే పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. పేద, ధనిక, మధ్యతరగతి అని తేడా లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా” పథకం అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఈ బీమా అందించనున్నామని, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 2026 జూన్ 2 నుంచి దీన్ని అమలు చేయనున్నట్టు భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు
అంతకుముందు బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థకు అవసరమైన బొగ్గు సరఫరాలో సింగరేణిది కీలక పాత్ర అని భట్టి తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా టీజీజెన్కో ద్వారా 11,460 మెగావాట్ల పంప్ స్టోరేజీ, ఇతర ప్రాజెక్టులకు రూ.95,150 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం అని, రెడ్ కో ద్వారా రూ. 1,23,350 కోట్ల పెట్టుబడులతో 12 ఒప్పందాలు కుదుర్చుకుని రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం అని తెలిపారు. ఇవి కేవలం పెట్టుబడులు మాత్రమే కాదు భవిష్యత్ తెలంగాణ శక్తి నిర్మాణానికి పునాదులు అన్నారు.
అధునాతన వసతులతో 105 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తున్నాం అని, ఇప్పటికే 79 స్కూల్స్ మంజూరు చేశాం, 40 చోట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి 33 జిల్లాల్లో 1,362 ప్రీ ప్రైమరీ విభాగాలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం అని, రాబోయే విద్యా సంవత్సరంలో 2 వేల నుంచి 2,500 పాఠశాలలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ. 1000 కోట్లు కేటాయించారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల వరకు నాణ్యమైన పోషకాలతో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం అని ప్రకటించారు. వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి పొందే ఆయా దేశాల భాషలో శిక్షణ ఇప్పిస్తాం అని, అలాగే వీసాలు పొందేందుకు మార్గదర్శకం చేయడంతో పాటు విదేశీ ప్రయాణానికి కావాల్సిన రక్షణ కల్పించనున్నట్లుగా తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Telangana Budget 2026 | రూ. 3,24,234 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి భట్టి
Harish Rao : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం
