Telangana Budget 2026 | రూ. 3,24,234 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి భట్టి
తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో 2026 -27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.3,24,234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406కోట్లు, మూలధన వ్యయం రూ.47,267కోట్లుగా ప్రతిపాదించారు. ఆరు గ్యారంటీలకు రూ.50,713కోట్లు ప్రతిపాదించారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక మంత్రి(Telangana Finance Minister) భట్టి విక్రమార్క( Bhatti Vikramarka) శుక్రవారం అసెంబ్లీలో 2026 -27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.3,24,234 కోట్లతో బడ్జెట్(Telangana budget 2026) ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406కోట్లు, మూలధన వ్యయం రూ.47,267కోట్లుగా ప్రతిపాదించారు. ఆరు గ్యారంటీలకు రూ.50,713కోట్లు ప్రతిపాదించారు.
పశు సంవర్థక శాఖకు 1,529కోట్లు, విద్యుత్ శాఖకు 21,285 కోట్లు ప్రతిపాదించారు. విద్యా శాఖ కు 26,674కోట్లు, వైద్య, ఆరోగ్య శాఖకు 13,679 కోట్లు, కార్మిక శాఖకు రూ. 998కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 3,143 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 11,784కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,937 కోట్లు. బీసీ సంక్షేమానికి 3,769 కోట్లు కేటాయింపులు చేశారు. రాజీవ్ యువ వికాసానికి 6 వేల కోట్లు. గృహా నిర్మాణ శాఖకు 7,430కోట్లు ప్రతిపాదించారు. పంచాయతీరాజ్ శాఖకు రూ.2,622కోట్లు కేటాయించారు.
రాష్ట్రంలోని 118 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెల 2 వేల స్కాలర్ షిప్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది.
మైనారిటీ సంక్షేమం- రూ.3769 కోట్లు, ఇరిగేషన్ -రూ.22615 కోట్లు, మున్సిపల్ శాఖ- రూ.17907 కోట్లు, గృహ నిర్మాణం- రూ.7430 కోట్లు, ఐటీ- రూ.875 కోట్లు, చేనేత- రూ.258 కోట్లు, పరిశ్రమలు- రూ. 3490 కోట్లు, ఆర్‌అండ్‌బీ – రూ.12789 కోట్లు, న్యాయ శాఖ- రూ.2367 కోట్లు, హోంశాఖ- రూ. 121907 కోట్లు, టూరిజం- రూ. 1224 కోట్లు, గోదావరి పుష్కరాలు -రూ.500 కోట్లు కేటాయించారు.
రాష్ట్ర ఆర్థిక స్థితి
GSDP: ₹17,82,198 కోట్లు (వృద్ధి 10.7%) – దేశ సగటు 8% కంటే 2.7% ఎక్కువ.
తలసరి ఆదాయం: ₹4,18,931 (దేశం కంటే 1.9 రెట్లు ఎక్కువ).
లక్ష్యం: 2034 నాటికి 1 ట్రిలియన్ USD, 2047 నాటికి 3 ట్రిలియన్ USD ఆర్థిక వ్యవస్థ.
ప్రధాన విజన్
రాష్ట్రాన్ని CURE – PURE – RARE మూడు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి.
భారత్ ఫ్యూచర్ సిటీ (30,000 ఎకరాలు) – స్కిల్ యూనివర్సిటీతో పాటు.
GHMCని 3 కార్పొరేషన్లుగా విభజించారు (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి).
ప్రధాన కొత్త పథకాలు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా – ప్రతి కుటుంబానికి ₹5 లక్షలు (జూన్ 2, 2026 నుండి).
రాజీవ్ సివిల్స్ అభయహస్తం – సింగరేణి CSR ద్వారా ఆర్థిక సహాయం.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ + 118 ATCలు + స్కాలర్‌షిప్ ₹2,000/నెల.
ఇందిర సౌర గిరి జల వికాసం – గిరిజనులకు 100% సబ్సిడీ సోలార్ పంపులు.
సంక్షేమ పథకాలు (Abhaya Hastam)
మహాలక్ష్మి: 34.37 లక్షల మహిళలు ఉచిత బస్సు – ₹9,222 కోట్లు ఆదా.
₹500 గ్యాస్ సిలిండర్ – 42.90 లక్షల కుటుంబాలు – ₹752 కోట్లు ఆదా.
గృహజ్యోతి: 53.09 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితం – ₹3,900 కోట్లు సబ్సిడీ.
చేయూత: 2 లక్షల కొత్త పెన్షన్లు.
కొత్తగా 2లక్షల పెన్షన్లు
ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కోసం కొత్తగా 2 లక్షల చేయూత పెన్షన్లను మంజూరు చేస్తున్నట్లు బడ్జెట్లో భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను పరిశీలించి, త్వరలోనే ఈ పెన్షన్లను మంజూరు చేయనున్నట్లుగా తెలిపారు. దీని కోసం బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 1,45,590 కోట్లు కేటాయించింది. అందులో ముఖ్యంగా ఆరు గ్యారంటీలకు రూ. 50,713 కోట్లు, రైతు భరోసాకు రూ. 18,000 కోట్లు, చేయూత పెన్షన్లకు రూ. 14,861 కోట్లు కేటాయించారు.
ఇందిరమ్మ ఇండ్లకు రూ. 5,500 కోట్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కు రూ. 5,000 కోట్లు, మహాలక్ష్మి పథకం (ఉచిత బస్సు ప్రయాణం) రూ. 4,308 కోట్లు, సన్నవడ్ల బోనస్ కు, రూ. 3,500 కోట్లు, * బియ్యం సబ్సిడీకి, రూ. 3,000 కోట్లు, గృహ జ్యోతి (ఉచిత విద్యుత్)కి రూ. 2,080 కోట్లు, విద్యార్థుల డైట్ ఛార్జీల కోసం రూ. 2,170 కోట్లు, స్కాలర్‌షిప్‌ల కోసం రూ. 4,343 కోట్లు కేటాయించారు. జీవ్ ఆరోగ్య శ్రీకి రూ. 1,143 కోట్లు, ఉద్యోగుల హెల్త్ స్కీం కోసం రూ. 1,056 కోట్లు కేటాయించారు. మూసి నది పునరుజ్జీవనం కోసం ప్రాథమికంగా రూ. 1,500 కోట్లు కేటాయింపులు జరిగాయి.
రైతు & వ్యవసాయం
రైతు భరోసా: ₹12,000/ఎకరం/సంవత్సరం.
సన్నవడ్లకు క్వింటాల్‌కు ₹500 బోనస్ – ఎకరానికి సంవత్సరానికి ₹25,000 అదనపు ఆదాయం.
బడ్జెట్ కేటాయింపు: ₹23,179 కోట్లు (అత్యధికం).
మహేశ్వరం మరియు చౌటుప్పల్ లో 1500MWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లుగా బడ్జెట్ లో తెలిపారు. చేయుత పథకం ద్వారా అర్హులైన వారికి రెండు లక్షల నూతన పెన్షన్లను మంజూరు చేస్తున్నట్లుగా వెల్లడించారు. 12600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఇందిరా సౌర గిరిజల వికాసం అమలు చేయనున్నామని, షెడ్యూల్ తెగల వారికి 100% సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు అందించి వారి పురోగతికి తోడ్పడతాం అని ప్రకటించారు. ఆరు లక్షల ఎకరాల పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహించి రెండు లక్షల పదివేల గిరిజన రైతులకు ఈ సౌకర్యం అందించనున్నట్లుగా పేర్కొన్నారు.
ఇతర ముఖ్య విజయాలు
CSS బకాయి ₹3,000 కోట్లు విడుదల + ఈ సంవత్సరం ₹7,072 కోట్లు సాధించారు.
రుణ పునర్ వ్యవస్థీకరణ ద్వారా ₹22,142 కోట్లు క్యాష్ అవుట్‌ఫ్లో తగ్గింది.
67,763 మందికి ఉద్యోగాలు – TGPSC UPSC స్థాయికి ఎత్తారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – ₹5.75 లక్షల కోట్లు MoUలు.
హైదరాబాద్‌లో 20% Global Capability Centers (GCCs).
ప్రత్యేక కార్యక్రమాలు
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (మార్చి 6 – జూన్ 12, 2026) – 99 రోజులు 10 అంశాలతో.
జనగణన 2027 – కుల గణన + సెల్ఫ్ ఎన్యూమరేషన్.
భూ భారతి చట్టం – AI చాట్‌బాట్ “భూ మిత్ర”, 5,010 గ్రామ పాలనాధికారులు.
HYDRAA – 1,45 ఎకరాలు ఆక్రమణల నుంచి స్వాధీనం (విలువ ₹60,000 కోట్లు).
పాలన దర్శనం
“ప్రజలు మాకు అప్పగించిన అధికారం బాధ్యత” – ప్రజా సేవకులం అని ఆర్థిక మంత్రి భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అంబేద్కర్, గాంధీ, కలాం ఉద్ధృతులు ఉపయోగించి ఆదర్శవంతమైన పాలన ధ్యేయం చాటారు. “బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు”.తెలంగాణను “బూడిదలో నుంచి ఫీనిక్స్ పక్షి”లా అభివృద్ధి చేస్తున్నామని సగర్వం ప్రకటించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram