Maganti Sunitha As Canditate For Jublie Hills | జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగుంట సునీత ఖరారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను కేసీఆర్ ఖరారు చేశారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు త్వరలో తేలనున్నారు.

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో.. త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగనుంది. ఉప ఎన్నికలలో పోటీకి బీఆర్ఎస్ పార్టీ పలువురు పేర్లను పరిశీలించినప్పటికి…మాగంటి గోపినాథ్ కుటుంబానికి జూబ్లీహిల్స్ ప్రజల్లో ఉన్న అభిమానం నేపథ్యంలో ఆయన సతీమణి మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఫైనల్ చేశారు.
కాంగ్రెస్ నుంచి నవీన్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్, సీఎన్.రెడ్డి, ఫసీయుద్దిన్, బొంతు రాంమోహన్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంగా నవీన్ కుమార్ వైపు మొగ్గుచూపుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది కూడా మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. బీజేపీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు సాగుతుంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్లు అధికంగా ఉండటం గమనార్హం.