Banda Krishna Mohan Reddy | కాంగ్రెస్ గూటికి గద్వాల బీఆరెస్ ఎమ్మెల్యే బండ్ల ? వలసల కట్టడికి కేసీఆర్ ప్రయత్నాలు విఫలం !

కాంగ్రెస్‌లో చేరేందుకు మరో బీఆరెస్ ఎమ్మెల్యే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లోని గద్వాల నియోజకవర్గం బీఆరెస్ ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్‌రెడ్డి రేపో ఎల్లుండో కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా సమాచారం.

Banda Krishna Mohan Reddy | కాంగ్రెస్ గూటికి గద్వాల బీఆరెస్ ఎమ్మెల్యే బండ్ల ? వలసల కట్టడికి కేసీఆర్ ప్రయత్నాలు విఫలం !

విధాత, హైదరాబాద్ :  కాంగ్రెస్‌లో చేరేందుకు మరో బీఆరెస్ ఎమ్మెల్యే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లోని గద్వాల నియోజకవర్గం బీఆరెస్ ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్‌రెడ్డి రేపో ఎల్లుండో కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్‌లో చేరికకు సంబంధించి ఇప్పటికే కృష్ణ మోహన్‌రెడ్డి తన అనుచరుల, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని గద్వాల రాజకీయ వర్గాల కథనం. ఇప్పటికే బీఆరెస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరో 20మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి బీఆరెస్‌లో చేరబోతున్నట్లుగా కాంగ్రెస్ నాయకులు పదేపదే చెబుతున్నారు.

అసెంబ్లీలో బీఆరెస్‌కు 38మంది సభ్యుల బలముండగా ఇప్పటికే చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు సహా 26మంది కాంగ్రెస్‌లో చేరితే టీఆరెసెల్పీ విలీనమైనట్లే. అప్పుడు వారిపై పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా ఉంటుంది. వలసల కట్టడికి ఇటీవల బీఆరెస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఆచరణలో పెద్దగా ఫలించినట్లుగా లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చలు జరిపిన తర్వాతా కూడా గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి పార్టీని వీడనున్న నేపథ్యంలో మునుముందు అదే దారిలో మరింత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరవచ్చన్న ప్రచారం బలపడుతుంది.

Read More

మిషన్ భగీరథపై గతంలో మీరు ఇచ్చిన ప్రకటనలు బోగస్ వేనా .. డిప్యూటీ సీఎం భట్టి
యువతిపై లైంగిక దాడి.. కారులోనే చిత్ర హింసలు.. నిందితుల అరెస్టు

 పాలన గాలికి,పగ ప్రతీకారంపైనే దృష్టి … కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌