Harish Rao | ఊసరవెల్లి కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుంది.. రేవంత్‌పై హరీశ్‌రావు వ్యంగ్యాస్త్రాలు
Harish Rao | రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళనల వెనుక కేటీఆర్( KTR ), హరీశ్‌రావు( Harish Rao ) పాత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మహబూబ్‌నగర్‌లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఉద్యోగ నియామక పరీక్షల వాయిదాపై ముఖ్యమంత్రివి పరిణితి లేని వ్యాఖ్యలు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళనల వెనుక కేటీఆర్( KTR ), హరీశ్‌రావు( Harish Rao ) పాత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మహబూబ్‌నగర్‌లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఉద్యోగ నియామక పరీక్షల వాయిదాపై ముఖ్యమంత్రివి పరిణితి లేని వ్యాఖ్యలు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
మీరు గతం మరిచిపోయినట్టున్నారు..! నాడు.. గ్రూప్ 2, టెట్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని అభ్యర్థులు అడిగితే మీరు మద్దతు తెలపలేదా..? అని రేవంత్‌ను హరీశ్‌రావు ప్రశ్నించారు. అప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మీరు ఇప్పుడెందుకు సానుకూలంగా ఆలోచించడం లేదు? అని నిలదీశారు.
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరొక మాటనా..? ఊసరవెల్లి కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుంది. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశయాలతో, జీవితాలతో రాజకీయం చేసింది మీరు. అధికారంలోకి వచ్చాక వారి ఆకాంక్షలను పక్కనపెట్టి, నడి రోడ్డున పడేలా చేసింది మీరు. డీఎస్సీ వాయిదా వేయాలని కోరితే, అడ్డగోలుగా మాట్లాడుతున్నది మీరు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. అభ్యర్థులు, నిరుద్యోగులపై ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దౌర్భాగ్యం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
పార్టీల బలోపేతానికే విద్యార్థులను రెచ్చగొడుతున్నారు సన్నాసులు అంటున్న రేవంత్.. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాజకీయం కోసమే వాయిదా కోరినారా..? రాత్రి, పగలు కూడా లెక్కచేయకుండా నిరుద్యోగ అభ్యర్థులు పోరాటం చేస్తుంటే సానుభూతి చూపాల్సింది పోయి, రాజకీయ విమర్శలు చేస్తున్నారు. సమస్యకు పరిష్కారం చూపకుండా నిందలు మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మీరు వ్యవహరిస్తున్న తీరును, మీ రెండు నాల్కల ధోరణిని ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పక బుద్ధి చెబుతారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram