నేడు బీఆరెస్ మ్యానిఫెస్టో

ఆదివారం బీఆరెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మ్యానిఫెస్టోను ప్రకటించనుంది. గులాబీ పార్టీ తన మ్యానిఫెస్టోలో ఎలాంటి వరాలు ఇవ్వనుందోనన్న ఆసక్తి నెలకొంది

నేడు బీఆరెస్ మ్యానిఫెస్టో

విధాత : ఆదివారం బీఆరెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మ్యానిఫెస్టోను ప్రకటించనుంది. గులాబీ పార్టీ తన మ్యానిఫెస్టోలో ఎలాంటి వరాలు ఇవ్వనుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్ లకు ప్రజలలో సానుకూల స్పందన వస్తుండడాన్ని గులాబీ బాస్ సీఎం కేసీఆర్ పసిగట్టారు. కాంగ్రెస్ హామీలకు మించి బీఆరెస్ మేనిఫెస్టోలో ఎన్నికల హామీలు ఉండబోతున్నాయని భావిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలో తమ వద్ద ఎన్నికల్లో ప్రయోగించే బ్రహ్మాస్త్ర పథకాలు ఎన్నో ఉన్నాయని కేసీఆర్ చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. రాజకీయ వర్గాల అంచనాల మేరకు రైతుబంధు కు ఇచ్చే నగదు సహాయం మరింత పెంచే ఛాన్స్ ఉంది .

గృహిణులకు ఊరటనీచ్చే హామీలు వుంటాయని, దళిత ,బీసీ, మైనారిటీ బందు పథకాలు ఎక్కువమందికి అందేలా కార్యాచరణ హామీలు వుంటాయని అంచనా వేస్తున్నారు. సామాజిక భద్రత కింద ఇస్తున్న పెన్షన్ల పెంపుకు అవకాశం ఉందని, యువత కోసం మరిన్ని హామీలు రేపు మ్యానిఫెస్టోలో ప్రకటిస్తారని తెలుస్తోంది. ప్రధాన సామాజిక వర్గాలకు పూర్తిస్థాయిలో మ్యానిఫెస్టోలో ప్రాధాన్యత నిస్తారని సమాచారం.