బీఆర్ఎస్ లో చేరిన చెరుకు సుధాక‌ర్

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు, పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్య‌మకారుడు డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్ బీఆర్ఎస్ లో చేరారు.

బీఆర్ఎస్ లో చేరిన చెరుకు సుధాక‌ర్

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు, పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్య‌మకారుడు డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్ బీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాదులో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆయనకు పార్టీ కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. డాక్టర్ చెరుకు సుధాకర్ నల్గొండ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ పార్టీపై సంచలమైన ఆరోపణలు చేసి, బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.


 



మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నకిరేకల్, ఆలేరు నియోజకవర్గం నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి ఎమ్మెల్యేలు గొంగిడి సునీత‌, చిరుమ‌ర్తి లింగ‌య్య‌, గాయ‌కుడు ఏపూరి సోమ‌న్న‌, ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.