Chevella Bus Accident : ఇది నా ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా? : కలిచివేసిన తండ్రి దుఃఖం
చేవెళ్ల బస్సు ప్రమాదంలో ముగ్గురు కూతుళ్లను కోల్పోయిన తండ్రి ఎల్లయ్య రోదనలు అందరినీ కలచివేశాయి.
విధాత, హైదరాబాద్ : ఇటీవల జరిగిన చేవెళ్ల బస్సు ప్రమాదంలో మరణించిన ముగ్గురు అమ్మాయిలు తనూష, సాయిప్రియ, నందినిలకు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసిన ఎక్స్ గ్రేషియాను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారి తండ్రి ఎల్లయ్యకు అందించారు. బాధిత కుటుంబానికి పరిహారంగా రూ.7 లక్షల చొప్పున రూ.21 లక్షల విలువైన చెక్కును తండ్రి ఎల్లయ్యకు అందించారు. ఈ సందర్భంగా ఇది నా ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా అని గుండెలు బాదుకుంటూ తండ్రి ఎల్లయ్య చేసిన రోధనలు అందరిని కలిచి వేశాయి.
తాండూరుకు చెందిన నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయి ప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ)లు బంధువుల పెళ్లి కోసం ఇటీవల హైదరాబాద్ నుంచి సొంత ఊరుకు వెళ్లి..తిరుగు ప్రయాణంలో బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో మరణించిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో ముగ్గురు అక్కా చెల్లెళ్లు మృతి చెందడం అందరిని కంటతడి పెట్టించింది. ఇదే ప్రమాదంలో మొత్తం 20మంది మరణించారు. తనకున్న నలుగురు బిడ్డలలో ఇటీవలే పెద్ద బిడ్డ పెళ్లి చేసిన ఎల్లయ్య మిగిలిన ముగ్గరి బిడ్డలను రోడ్డు ప్రమాదంలో కోల్పోయాడు. అల్లారు ముద్దుగా ఏ లోటు రాకుండా పెంచి చదివిస్తున్న తన ముగ్గుర బిడ్డలు ఒకే ప్రమాదంలో చనిపోవడంతో తండ్రి ఎల్లయ్య తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Read Also:Ant Phobia | వింత ఘటన..చీమల ఫోబియాతో ఓ గృహిణి ఆత్మహత్య
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram