గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన.. సీఎం నవీన్ పట్నాయక్‌

అసెంబ్లీ ఎన్నికలో ఓటమి నేఫథ్యంలో ఒడిస్సా సీఎం, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బుధవారం గవర్నర్ రఘుబర్ దాస్‌కు అందచేశారు. నవీన్ పట్నాయక్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు

  • By: Subbu |    telangana |    Published on : Jun 05, 2024 6:47 PM IST
గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన.. సీఎం నవీన్ పట్నాయక్‌

విధాత, హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికలో ఓటమి నేఫథ్యంలో ఒడిస్సా సీఎం, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బుధవారం గవర్నర్ రఘుబర్ దాస్‌కు అందచేశారు. నవీన్ పట్నాయక్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగే వరకు తాత్కాలిక సీఎంగా కొనసాగాలని కోరారు. 24 ఏళ్లపాటు ఏకధాటిగా ఒడిస్సాను పాలించిన బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్‌కు తొలిసారిగా ఓటమి ఎదురయ్యింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఒడిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 147స్థానాలకు గాను బీజేపీ 78స్థానాల్లో విజయం సాధించింది. బిజూ జనతాదళ్ 51, కాంగ్రెస్ 14, ఇతరులు 4చోట్ల గెలుపొందారు. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ ఒడిస్సాలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుంది.