మధుయాష్కిగౌడ్‌కి సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ

అస్వస్థతకు గురైన మధుయాష్కి గౌడ్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Madhu yaskhi Goud

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విధాత): అస్వస్థతకు గురై గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌కి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన కారణాలను తెలుసుకున్నారు.

మంగళవారం సెక్రటేరియట్ లో మధుయాష్కీ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న సీఎం.. వెంటనే స్పందించి ఏఐజీ ఆస్పత్రిలో చేరేంత వరకు వారి సిబ్బంది, అధికారులకు సూచనలు చేసి మానిటరింగ్ చేశారు. ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితోనూ సీఎం మాట్లాడి.. మధుయాష్కీకి అందిస్తున్న చికిత్స పై ప్రత్యేక పర్యవేక్షణ ఉండేలా చూడాలని సూచించారు.
ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సీఎం రేవంత్ మధుయాష్కికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించి.. పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డికి మధుయాష్కి కృతజ్ఞతలు తెలిపారు.