Kavitha| సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి కవిత ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. పంచాయితీ ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని, దాన్ని ఆపాలని ఎన్నికల అధికారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖలో ఫిర్యాదు చేశారు.
విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy)పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత( Kavitha) తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల(Election Commission) అధికారికి ఫిర్యాదు చేశారు. పంచాయితీ ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని, దాన్ని ఆపాలని ఎన్నికల అధికారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖలో ఫిర్యాదు చేశారు.
మక్తల్, కొత్తగూడెం సభల్లో సర్పంచులుగా మంత్రులు, ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండి పనులు చేయించే వారిని గెలిపించాలని కోరి ఎన్నికల కోడ్ ను సీఎం రేవంత్ రెడ్డి ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రజా ధనాన్ని వినియోగించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి గారిపై ఇదివరకే తెలంగాణ జాగృతి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చిందని తెలిపారు. నవంబర్ 30వ తేదీన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని నిలుపుదల చేయించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కట్టడి చేయాలని కవిత కోరారు.
పవన్ దిష్టి వ్యాఖ్యలపై కవిత కౌంటర్
తెలంగాణ నాయకుల దిష్టి కళ్లతో కోనసీమ పాడైందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కవిత మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఏనాడు దిష్టి పెట్టలేదు అని, కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నాం అని తెలిపారు. తెలంగాణ బిడ్డల మనసు చాలా గొప్పది. మేము పెద్దగా ఆలోచిస్తాం. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మనం బిడ్డలు ప్రాణాలే త్యాగం చేశారు అన్నారు. కానీ సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని విమర్శించారు. మా రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు అయ్యిందని.. ఎప్పుడు కూడా జై తెలంగాణ, జై ఆంధ్రా అనే అన్నాం అని గుర్తు చేశారు. తెలంగాణ ఎంత బాగుందో…ఆంధ్రా కూడా అంతే బాగుండాలని కోరుకున్నాం అని కవిత స్పష్టం చేశారు.
తెలంగాణ సాధనలో శ్రీకాంతాచారి చేసిన త్యాగాన్ని మాటల్లో కొలవలేం అని గుర్తు చేసుకున్నారు. ఉద్యమకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అమరవీరులను తగిన విధంగా గౌరవించలేదని విమర్శించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram