అంత చెత్తగాళ్ల వెనుక నేనెందుకు ఉంటా : కవిత ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
రేవంత్ రెడ్డి కవిత ఆరోపణలకు కౌంటర్. "అంత చెత్తగాళ్ల వెనుక నేనెందుకు ఉంటా" సీఎం బలమైన మాటలు. కల్వకుంట్ల కుటుంబ వివాదాలపై విమర్శలు

విధాత : హరీష్ రావు, సంతోష్ రావుల వెనకలా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉన్నారని ఒకరు అంటే.. లేదులేదు కవిత వెనకలా ఉన్నారని ఇంకొకరు అంటున్నారని..మీరంతా దిక్కుమాలినోళ్లు అని తెలంగాణ ప్రజలు బండ కేసి కొట్టారని..మీ వెనుకలా ఎవడైన బుద్ది ఉంటాడా.. అన్నం తినేవాడు ఎవడైనా మీతో ఉంటాడా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంత చెత్తగాళ్ల వెనుక నేనెందుకు ఉంటానని.. నేను నాయకుడిని.. ఉంటే ముందుంటా..మావాళ్లకు తోడుంటానన్నాను. నేను ఉండేది పాలమూరు(Palamuru) జిల్లా, తెలంగాణ ప్రజల వెనుక ఉంటానని..వారికి తోడుగా ఉంటానన్నారు. కేసీఆర్ కుటుంబంలోని తాజా పరిణామాలపై పాలమూరు జిల్లా సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
నాకు కల్వకుంట్ల కుటుంబ వివాదాల వెనుక ఉండే అంత సమయంలేదని… ఇంత పనికిమానోళ్ల వెనుక నేనెందుకు ఉంటానన్నానని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జరుగుతున్న పరిణమాలు అందరికి తెలుసు..మీ వివాదంలోకి మీ కుటుంబ, కుల పంచాయతీలలోకి మమ్మల్ని లాగకండని హితవు పలికారు. మీ కుటుంబ పంచాయతీపై మాకు ఎలాంటి ఆసక్తి లేదని..మీమ్మిల్ని ఎప్పడో ప్రజలు తిరస్కరించారని కల్వకుంట్ల కుటుంబానికి స్పష్టం చేశారు. మీరు కాలం చెల్లిన 1000నోటు లాంటోళ్లు..కాల గర్బంలో ఆ పార్టీ కలిసిపోతుందన్నారు. దేశంలో జనతా పార్టీ, తెలంగాణలో టీడీపీ(TDP) వంటి పార్టీలే కనుమరుగయ్యాయని.. ఇన్ని దుర్మార్గులు చేసిన మీరు మాత్రం ఎలా మనుగడ సాగిస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పృకృతి అనేది ఉంటుంది..అది శిక్షస్తుంది..అందులో మనకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు.
ఒకప్పుడు ఏ పార్టీని బతుకనివ్వం..ఎవరిని ఎమ్మెల్యేలను కానివ్వమని గతంలో అక్రమ కేసులు పెట్టి ఎందరినో జైళ్లకు పంపించినోళ్లు..ఇప్పుడు వాళ్లలో వాళ్లే తన్నుకోని చస్తున్నారని కేసీఆర్(KCR) కుటుంబంలోని పరిణామాలపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కడుపులో కత్తులు పెట్టుకుని వాళ్లకు వాళ్లే ఒకరినొకర పొడుచుకుంటున్నారు..విపరీతమైన అవినితి సొమ్ము పంపకాల్లో.. కుటుంబ పంచాయతీలలో..ఒకరికొకరు సహించుకోలేక యాసిడ్ దాడులు చేసుకోవాలని..నవ్వుతునే కడుపులు కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటుున్న పరిస్థితులు రాష్ట్రంలో దాపురించాయని రేవంత్ రెడ్డి అన్నారు. పాపం ఉరికే పోదని..పెద్దలు చేసుకున్నోడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పారని.. పాపాలు ఎక్కడి పోవు..ఖచ్చింతగా వెంటాడుతుంటాయి.. వాళ్లు అనుభవించాల్సిందేనన్నారు. రాజకీయాలవైపు చూడకుండా పాలమూరు జిల్లాను అభివృద్ది చేసుకుందామన్నారు. నా ప్రథమ ప్రాధాన్యత ఇరిగేషన్(Irrigation), ఎడ్యూకేషన్(Education) అని..అవి ఉంటే ఉద్యోగాలు, ఉపాధి వస్తుందన్నారు.