ఫ్యూచర్ సిటీకి అంతర్జాతీయ స్థాయి సంస్థలు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు నిర్దేశించారు. ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని, ఇన్వెస్ట్ తెలంగాణ కోసం ఆకర్షణీయమైన లోగో,వెబ్ సైట్ రూపొందించాలని సూచించారు. ఇన్వెస్ట్ తెలంగాణ కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్ లో పరిశ్రమల శాఖ పైన పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలాట్మెంట్ ,పరిశ్రమల ఏర్పాటుపైన చర్చించారు.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థని రూపొందించాలని, ఇందుకోసం గ్రూప్ 1 స్థాయి అధికారిని ఎస్కార్ట్ ఆఫీసర్ గా నియమించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. భూ కేటాయింపు జరిగిన వెంటనే పరిశ్రమలు నిర్మాణం మొదలు పెట్టేలా నిబంధన విధించాలని స్పష్టం చేశారు. తమిళనాడు,గుజరాత్ పారిశ్రామిక విధానాన్ని అధ్యయనం చేయాలని తెలిపారు.
నెట్ జీరో సిటీ తరహాలోనే డిజైన్స్ ఉండాలని, మౌలిక వసతుల కల్పన అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి ..ఇందులో రాజీ పడొద్దు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలని, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసిన తర్వాతే భూ కేటాయింపులు చేయాలని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీ కి తీసుకురావాలని సూచించారు.
1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలి..
1500ఎకరాలలో డేటా సిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. డేటా సిటీ నీటి అవసరాల కోసం ఎస్ టీ పీ లను వినియోగించాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ లో ప్రజా ప్రతినిధులు,సివిల్ సర్వీస్ అధికారులు,జర్నలిస్ట్ లకు 500 ఎకరాలు కేటాయించనున్నట్లుగా తెలిపారు. కేంద్రం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ ను ఫ్యూచర్ సిటీ వచ్చేలా చర్య లు తీసుకోవాలని, అవసరం అయితే ప్రధాని మోదీ ని కలిసి హెల్త్ క్లస్టర్ కేటాయించాలని విజ్ఞప్తి చేద్దాం అన్నారు.
జూన్ లో ఫ్యూచర్ సిటీ ఇండ్రస్టియల్ పార్క్ లో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగేలా చూడాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించాలని ఆదేశించారు. జీసీసీలు, డేటా సెంటర్లు కోసం కరీంనగర్, వరంగల్, విజయవాడ రోడ్ల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించాలని తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాలల్లో జీసీసీ (Global Capability Centers) ఏర్పాటు పైన దృష్టి పెట్టేలా పాలసీ రూపకల్పన చేయాలని సూచించారు. మూడు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు టీ ఫైబర్ కు కనెక్ట్ కావాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి , తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) వైస్ చైర్మన్ శశాంక ,పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తో భట్టి విక్రమార్క భేటీ !
ఎండ తీవ్రత..కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
