• Telugu News
  • /Telangana

Revanth Reddy : ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలో మూసీనదీ తీరాన మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయాల సముదాయం పునర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం భూమిపూజ నిర్వహించారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Mar 28, 2026, 1:02 pm IST
Read Time: 4 mins
Revanth Reddy : ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

విధాత, హైదరాబాద్ : మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలో మూసీనదీ తీరాన మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయాల సముదాయం పునర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం భూమిపూజ నిర్వహించారు. వీర భద్రస్వామి ఆలయం వద్ద కుటుంబసమేతంగా గోపూజ కార్యక్రమంలో పాల్గొని, ఆధునిక గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

భగవత్ సంకల్పంగా భావిస్తున్నాను: సీఎం రేవంత్ రెడ్డి

మూసీ నది ప్రక్షాళనలో భాగంగా మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయాన్ని రూ.700కోట్లతో ఎనిమిది ఎకరాల్లో నిర్మించనుండటాన్ని తాను భగవత్ సంకల్పంగా భావిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీని ప్రక్షాళన చేసుకోపోతే ఢిల్లీ నగరం మాదిరిగా హైదరాబాద్ మారే ప్రమాదం ఉందన్నారు. నదులు కాలుష్యం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని, ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ కాలుష్య నగరంగా మారకూడదనే మూసీ ప్రక్షాళనకు నిర్ణయించామని స్పష్టం చేశారు. సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, గోదావరి, కృష్ణా జలాలను ఇంతకాలంగా సద్వినియోగం చేసుకోలేకపోయాం అన్నారు. ఇప్పుడు నదీ జలాలను సద్వినియోగం చేసుకుంటున్నాం అని తెలిపారు. మూసీ నది మత సామరస్యానికి వేదిక కానుందని, గాంధీ సరోవర్ తో పాటు ఉప్పల్, నాగోల్ ప్రాంతంలో అద్భుతమైన చర్చిని నిర్మిస్తాం అన్నారు. మసీద్ కూడా నిర్మించబోతున్నామని తెలిపారు.

 

ఇవి కూడా చదవండి :

Allu Arjun | జపాన్ అతిథికి అల్లు అర్జున్ సాంస్కృతిక కానుక .. ‘సీతారామ కళ్యాణం’ ప‌టం ఇవ్వ‌డానికి కార‌ణం?
Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ఆక‌స్మిక ధ‌న‌లాభం..!