సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ నాయకుల భేటీ

సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ నాయకులు కలసి రైతుల సమస్యలు, ధాన్యం-మొక్కజొన్న కొనుగోళ్లపై చర్చించారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు కొనసాగిస్తుందని సీఎం స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డితో సోమవారం సెక్రటేరియట్ లో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలోని సీపీఐ బృందం భేటీ అయ్యింది. సీపీఐ ఎంఎల్సీ సత్యం, రాష్ట్ర నాయకత్వం పశ్య పద్మ , ఈ. నరసింహ , చాడ వెంకట్ రెడ్డి, ,బాగం హేమంతరావు, శంకర్ , బాల నరసింహ, వీఎస్ బోసు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా కనీస వేతనాల పెంపుకు నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ బృందం ధన్యవాదాలు తెలిపింది. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం, మక్కల కొనుగోలులో కేంద్రం సహకరించక పోయినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. మొక్క జొన్న దిగుబడి బాగా వచ్చిందని, కేంద్రం మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదు అని, దీంతో ప్రభుత్వానికి నష్టం వచ్చినా మొక్క జొన్న కొనుగోలు చేస్తున్నాం అని వివరించారు. అలాగే యాసంగి ధాన్యం కొనుగోలు కూడా రికార్డు స్థాయిలో పూర్తి చేస్తామని వివరించారు.

ఇవి కూడా చదవండి :

హైదరాబాద్ నగర ప్రజల త్రాగు నీటి అవసరాలకు మల్లన్న సాగర్ నీళ్ళు
ఆంధ్రప్రదేశ్​లో ఎబోలా అలర్ట్‌.. ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్‌, ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు

Latest News