Cm Revanth Reddy | తెలంగాణ గవర్నర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు శనివారం భేటీ అయ్యారు. స్వయంగా సీఎం, డిప్యూటీ సీఎంలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు

  • By: Somu |    telangana |    Published on : Jun 01, 2024 3:19 PM IST
Cm Revanth Reddy | తెలంగాణ గవర్నర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం

విధాత : తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు శనివారం భేటీ అయ్యారు. స్వయంగా సీఎం, డిప్యూటీ సీఎంలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. గవర్నర్ కు తెలంగాణ రాష్ట్ర వేడుకల ఆహ్వాన పత్రికను అందజేశారు.

ప్రభుత్వం రాష్ట్ర అవతరణ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఘనంగా నిర్వహిస్తుందని, ఉత్సవాలకు అందరిని ఆహ్వానించామని, రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించనున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు. ఉత్సవాలు నిర్వహించనున్న తీరుతెన్నులను తెలిపారు. ఉత్సవాలకు గవర్నర్‌ను హాజరుకావాలని కోరారు.