బండి భగీరథ్‌పై కేసు దర్యాప్తు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విచారణ కోసం మహిళా ఐపీఎస్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన కేసులో విచారణ వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 8నే ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసు వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ ఆనంద్ వివరించారు. ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రికి డీజీపీ వివరించారు.
కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించారు. మైనర్ బాలికను మోసగించిన కేసులో సాయి భగీరథ్‌పై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైంది. అటు సాయి భగీరథ్ కూడా తనను బాలిక కుటుంబం హనీ ట్రాప్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదుపై కూడా టూటౌన్ పీఎస్ లో కేసు నమోదు చేశారు.
సీఎం ఆదేశాలతో సిట్ ఏర్పాటు
బండి భగీరథ్ కేసులో విచారణకు సీఎం ఆదేశాలతో డీజీపీ ఆనంద్ సిట్ ఏర్పాటు చేశారు. మహిళా ఐపీఎస్ అధికారిణి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినట్లుగా ఆనంద్ ప్రకటించారు. ఇప్పటికే కేసులో బాధిత బాలిక స్టేట్మెంట్ నమోదు చేశారు. భగీరథ్ ఫిర్యాదు మేరకు నమోదైన హనీ ట్రాప్ కేసులోనూ సిట్ విచారణ కొనసాగించనుంది.
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పెషల్ బెంచ్
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి సాయి భగీరథ్ మీద నమోదైన ఫోక్సో కేసు పైన తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TSCPCR) చైర్‌పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి స్పందించారు. నగర పోలీస్ కమిషనర్ నుంచి వివరాలు తెప్పించుకుని విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి :
నేడు, రేపు హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు
దేశ ప్రజలకు మోదీ సూచనల్లో మతలబు ఏమిటీ ?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram