కేంద్ర సహకారంపై చొరవ చూపండి..కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌

సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డికి బుధవారం మర్యాద పూర్వకంగా ఫోన్ చేశారు

కేంద్ర సహకారంపై చొరవ చూపండి..కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌

విధాత : సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డికి బుధవారం మర్యాద పూర్వకంగా ఫోన్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండేలా కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా రేవంత్ కోరారు. కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కోరారు. ఇందుకు కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించి రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం అందేలా తనవంతు కృషి చేస్తానన్నారు.