CM Revanth Reddy |ఎన్నికల పోరులో అలసి..ఫుట్‌బాల్‌తో సేదతీరి
మండుటెండల్లో సాగిన ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రచార ఘట్టం ముగిసిపోవడంతో ఆదివారం తనకిష్టమైన ఫుట్ బాల్ ఆటతో సేద తీరారు.

సరదాగా ఫుట్‌బాల్ ఆడిన సీఎం రేవంత్‌రెడ్డి
విధాత, హైదరాబాద్ : మండుటెండల్లో సాగిన ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రచార ఘట్టం ముగిసిపోవడంతో ఆదివారం తనకిష్టమైన ఫుట్ బాల్ ఆటతో సేద తీరారు. హైదరాబాద్ సెంట్రల్ యూవర్సిటీలో ఫుట్ బాల్ పోటీలను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి సరదాగా తాను కూడా ఫుట్ బాల్ ఆడారు. విద్యార్థులతో కలిసి పోటాపోటీగా ఫుట్ బాల్ ఆడి గోల్ కోసం ప్రయత్నం చేశారు. ఆట మధ్యలో షూ పాడైపోతే షూస్ లేకుండనే ఫుట్ బాల్ ఆడారు.
హెచ్‌సీయూ ఎన్‌ఎస్‌యూఐ యూనిట్, రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, హెచ్‌సీయూ ఎన్‌ఎస్‌యూఐ ఇంచార్జి అజయ్ టీంల మధ్య మ్యాచ్ నిర్వహించారు. ఈ ఫుట్‌బాల్ పోటీల్లో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఎమ్మెల్సీ బల్మార్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , టీఎంఆర్‌ఐఈఎస్ చైర్మన్ ఫహీం ఖురేషి, సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏం ఏ ఫహీం, టీ శాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.