డ్ర‌గ్స్ ప‌దం వింటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి

డ్రగ్స్​ పదం వింటేనే భయపడేలా పోలీసుల చర్యలు ఉండాలని సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి బంజారాహిల్స్​లోని కమాండ్​ కంట్రోల్​కు సీఎం రేవంత్​ రెడ్డి వెళ్లారు. అక్కడకు చేరుకున్న సీఎంకు సీఎస్​ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

డ్ర‌గ్స్ ప‌దం వింటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : డ్రగ్స్​ పదం వింటేనే భయపడేలా పోలీసుల చర్యలు ఉండాలని సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి బంజారాహిల్స్​లోని కమాండ్​ కంట్రోల్​కు సీఎం రేవంత్​ రెడ్డి వెళ్లారు. అక్కడకు చేరుకున్న సీఎంకు సీఎస్​ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం సైబర్​ సెక్యూరిటీ వింగ్​, డ్రగ్స్​ కంట్రోల్​ వింగ్​ సెంటర్లను సీఎం పరిశీలించారు. ఆ తర్వాత డ్రగ్స్​ నిర్మూలనకు తీసుకోవాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు నార్కోటిక్​ బ్యూరో డైరెక్టర్​ సందీప్​ శాండిల్య హాజరయ్యారు. అలాగే జీహెచ్​ఎంసీ కమిషనర్​, విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు సమీక్షకు హాజరు అయ్యారు.

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపాలని, ఈ విషయంలో మరింత యాక్టివ్​గా పనిచేయాలని సీఎం రేవంత్​ రెడ్డి వివరించారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్​ డ్రైవ్స్​ నిర్వహించాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని, గంజాయి, డ్రగ్స్​ సరఫరా చైన్​ను బ్రేక్​ చేయాలని ఆదేశించారు. సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలు ఉండాలని హెచ్చరించారు. డ్రగ్స్​ కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా ఎంత పెద్ద వారున్నా ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్​ టీమ్స్​ను ఏర్పాటు చేయండని తెలిపారు. డ్రగ్స్​ నిర్మూలన కోసం ఎఫెక్టివ్​గా పని చేసేవారిని ప్రోత్సహించండని చెప్పారు. డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. తెలంగాణను డ్రగ్స్​ రహిత రాష్ట్రంగా మార్చాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.