జర్నలిస్టుల ఇళ్లపై జూన్ 2 లోపు నిర్ణయం : సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీ విద్వేష ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత వీ.హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీసీ కులగణన అంశంపైనా మోదీపై విమర్శలు గుప్పించారు.
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో జూన్ 2 లోపు మంచి నిర్ణయం తీసుకుంటాం అని , దీనిపై ఈనెల 21న కేబినెట్ లో చర్చిస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేటాయింపు నిర్ణయానికి కేబినెట్ ఆమోదం ఉంటే చట్ట బద్దత ఉంటుంది అన్నారు. ఈనెల 21న జరిగే తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జర్నలిస్టులకు శుభవార్త అందిస్తామని రేవంత్ స్పష్టం చేశారు.
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం కేబినెట్ సబ్ కమిటీ వేశాం అని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావులతో కేబినెట్ సబ్ కమిటీ జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై సిఫారసులు అందిస్తుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
మోదీపై కేసు నమోదు చేయాలి: వీహెచ్
కవిత టీఆర్ఎస్ జోరు.. మే 20 నుండి జెండా పండుగ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram