విధాత: సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆయన క్యాంపు కార్యలయంలోకి ప్రవేశించిన కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ క్యాంపు కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చిత్రపటాలు పట్టకుండా మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ చిత్రపటాలు పెట్టడంపై తీవ్రంగా ఆక్షేపించారు.
ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలను మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి పెట్టారు. తమ నాయకుల చిత్రపటాలు తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.