Caste Census | తెలంగాణలో నవంబర్ 6 నుంచి కులగణన..! ఫార్మాట్ ఇదే.. అడిగే ప్రశ్నలు ఇవే..!!
Caste Census | రాష్ట్రంలో కులగణన(Caste Census ) చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) సిద్ధమైంది. ప్రధానంగా బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల( SC Reservations ) సమస్యను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందుకోసం నవంబర్ 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.
Caste Census | తెలంగాణ( Telangana )లో కులగణన( Caste Census ) చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) చర్యలు వేగవంతం చేసింది. ఈ ఏడాది నవంబర్ 6వ తేదీన కులగణన ప్రారంభించి.. 30వ తేదీ నాటికి ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కులగణనపై సంబంధిత అధికారులు, మేధావులతో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) సర్కార్ చర్చోపచర్చలు నిర్వహించింది. కులగణన సర్వే కోసం 80 వేల మంది సిబ్బందిని నియమించి, వారికి శిక్షణ ఇస్తామని ఇటీవలే రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక శాఖ కులగణనకు సంబంధించిన ఫార్మాట్‌ను ప్రత్యేకంగా ఏడు పేజీల్లో రూపొందించింది. 54 ప్రశ్నలను తయారు చేసింది.
ఇక కులగణన సర్వేలో భాగంగా ఇంటి యజమాని ఆధార్ నంబర్‌తో పాటు మిగతా కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లను అధికారులు తప్పనిసరిగా సేకరించనున్నారు. దీంతో పాటు వ్యక్తిగత వివరాలు, చదువు, వృత్తి, ఆస్తులు, రిజర్వేషన్లతో పొందిన ప్రయోజనాలు వంటి వివరాలను కూడా సేకరించనున్నారు. ధరణి( Dharani ) సమాచారం కోసం ప్రత్యేక పేజీని కేటాయించారు. ఇక ఆ కుటుంబంలో ఎవరైనా రాజకీయ నాయకులు( Political Leaders ) ఉన్నారా..? వారి రాజకీయ నేపథ్యం ఏంటనే వివరాలను కూడా సేకరించనున్నట్లు తెలుస్తోంది.
కులగణన ఫార్మాట్‌లోని కొన్ని ప్రశ్నలివే..( Caste Census Format )
పార్ట్ -1
క్రమసంఖ్య, కుటుంబ యజమాని-సభ్యుల పేర్లు, యజమానితో సంబంధం, జెండర్, మతం, కులం/సామాజిక వర్గం, ఉప కులం, ఉప కులం యొక్క ఇతర పేర్లు, వయసు, మాతృభాష, ఆధార్ నంబర్.
పార్ట్ -2
ఎలక్షన్ కమిషన్ గుర్తింపు కార్డు, దివ్యాంగులైతే వైకల్య రకం, వైవాహిక స్థితి, వివాహ కాలం నాటికి వయసు, ఆరేళ్ల వయసులోపు పాఠశాలలో చేరారా లేదా? పాఠశాల రకం, విద్యార్హతలు, 6-16 ఏళ్ల మధ్య వయసువారు బడి మానేస్తే ఆ సమయానికి చదువుతున్న తరగతి, వయసు. బడి మానేయటానికి గల కారణాలు. 17-40 ఏళ్లలోపు వారు విద్యను కొనసాగించకపోవడానికి గల కారణాలు, నిరక్షరాస్యులైతే చదువుకోకపోవడానికి గల కారణాలు.
పార్ట్-3
ప్రస్తుతం ఏదైనా పనిచేస్తున్నారా? చేస్తుంటే ఆ వృత్తి, స్వయం ఉపాధి అయితే సంబంధిత వివరాలు. రోజువారీ వేతన జీవులైతే ఏ రంగంలో పనిచేస్తున్నారు? కులవృత్తి, ప్రస్తుతం కులవృత్తిలో కొనసాగుతున్నారా లేదా? కులవృత్తి కారణంగా ఏమైనా వ్యాధులు సంక్రమించాయా? వార్షికాదాయం, ఆదాయ పన్ను చెల్లింపుదారులా? బ్యాంకు ఖాతా ఉందా లేదా?
పార్ట్-4
రిజర్వేషన్ల వల్ల పొందిన విద్య ప్రయోజనాలు. ఉద్యోగ ప్రయోజనాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన వారైతే కుల ధ్రువీకరణ పత్రం పొందారా? సంచార లేదా పాక్షిక సంచార తెగకు చెందిన వారా? రాజకీయ నేపథ్యం ఏమిటి? ప్రజాప్రతినిధిగా ఉంటే ప్రస్తుత పదవి ఏమిటి? న్ని సార్లు ప్రజాప్రతినిధిగా ఉన్నారు? మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? నామినేటెడ్/ కార్పొరేషన్/ ప్రభుత్వ సంస్థలు వేటిలోనైనా సభ్యులా?
పార్ట్-5
ధరణి పాస్‌బుక్ ఉందా, లేదా? ఉంటే పాస్‌బుక్ నంబర్, భూమి రకం, విస్తీర్ణం, వారసత్వమా? కొన్నదా? బహుమానమా? అసైన్డ్ భూమా? అటవీ హక్కుల ద్వారా పొందినదా? ప్రధాన నీటి వనరు, పండే పంటలు, ఏమైనా రుణాలు తీసుకున్నారా? ఏ అవసరం నిమిత్తం తీసుకున్నారు? ఎక్కడి నుంచి తీసుకున్నారు? వ్యవసాయ అనుబంధంగా ఏదైనా పనిచేస్తారా? కుటుంబానికి చెందిన పశుసంపద (ఆవులు, ఎడ్లు, గేదెలు, మేకలు, కోళ్లు, బాతులు, పందులు, ఇతరాలు) వివరాలు.
పార్ట్-6
కుటుంబ స్థిరాస్తుల వివరాలు, ఆస్తుల సంఖ్య, చరాస్తుల వివరాలు, ఆస్తుల సంఖ్య, ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలు, నివాస గృహం రకం, స్వభావం, మరుగుదొడ్డి ఉందా/లేదా? ఉంటే వాడుతున్నారా? వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం, ఇంటికి విద్యుత్ సదుపాయం ఉందా?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram