Komatireddy Rajagopal Reddy | డీకే శివకుమార్‌తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ
Komatireddy Rajagopal Reddy | కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో ఉన్న ఆయన అవసరమైతే ఉప ఎన్నికకు కూడా వెనుకాడబోనని వ్యాఖ్యలు చేశారు.

Komatireddy Rajagopal Reddy | విధాత, హైదరాబాద్ : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో ఉన్న ఆయన అవసరమైతే ఉప ఎన్నికకు కూడా వెనుకాడబోనని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరునాడే డీకే శివకుమార్ తో భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు డీకే శివకుమార్ వచ్చారు. ఓ హోటల్ లో డీకే శివకుమార్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరే ముందు, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చిందని, కానీ, ఇప్పుడు ఈ హామీని అమలు చేయడం లేదని ఆయన డీకే శివకుమార్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే మర్యాదపూర్వకంగానే డీకే శివకుమార్ తో భేటీ అయినట్టు రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మంత్రి పదవితో పాటు, రాజకీయాల గురించి చర్చించలేదని రాజగోపాల్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.