Danam Nagender | శాసనసభలో దానం నాగేందర్ బూతుపురాణం
ఖైరతాబాద్ ఎమ్మేల్యే దానం నాగేందర్ తెలంగాణ శాసనసభలో రాయలేని భాషలో ప్రతిపక్ష సభ్యులను బూతులు తిట్టారు. హైదరాబాద్ అభివృద్ధిపై జరుగుతున్న చర్చలో భాగంగా మైక్ సంపాదించిన దానం ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యులపై తన అసలైన శైలిలో తిట్లతో ఎగబడ్డారు.

బిఆర్ఎస్ నుండి గెలిచిన ఖైరతాబాద్(Khairatabad) శాసనసభ్యుడు దానం నాగేందర్(Danam Nagendar) నిండు సభలో బూతులు (Abuses BRS MLAs)అందుకున్నారు. జాబ్ క్యాలెండర్‌పై మాట్లాడేందుకు అనుమతి కోరుతూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ వద్ద ఆందోళన చేస్తున్న సమయాన, హైదరాబాద్‌పై లఘచర్చలో పాల్గొనే అవకాశం వచ్చిన దానం, మైక్‌లోనే వారిని దారుణమైన బూతులు తిట్టారు. ఆయన ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నారో స్పష్టం చేయాలని స్పీకర్‌ను పట్టుబట్టిన బిఆర్ఎస్ శాసనసభ్యులనుద్దేశించి, “నీయమ్మ.., నా కొడకల్లారా.., తోలు తీస్తా..” అని ఇంకా రాయలేని భాషలో తిట్టారు.
కేటీఆర్(KTR), పల్లా, కౌశిక్‌రెడ్డి, సబిత తదితరులను నాగేందర్ బండబూతులు తిడుతూ ఊగిపోయారు. ఇదంతా జరుగుతున్నా, స్పీకర్ సుతిమెత్తగా మందలిస్తున్నా, సభానాయకుడు సిఎం సమక్షంలోనే(In presence of CM) ఇదంతా జరిగింది. కాగా, కొంతమంది కాంగ్రెస్ శాసనసభ్యులు దానంగా అండగా నిలబడటం గమనార్హం. నాగేందర్ దురహంకార వ్యాఖ్యలపై మాట్లాడేందుకు కూడా బిఆర్ఎస్ సభ్యులకు స్పీకర్(Speaker) అవకాశం ఇవ్వకపోవడంతో సిగ్గు..సిగ్గు అనుకుంటూ బిఆర్ఎస్ వాకౌట్(Walkout) చేసింది. ఇంత తతంగం జరుగుతున్న సభలోనే ఉన్న ముఖ్యమంత్రి నోరు మెదపకపోవడం విశేషం.
దానం నాగేందర్‌కు ఇదేం కొత్త కాదు. గతంలోనూ ఆయన ఇలా ప్రవర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఉస్మానియా విద్యార్థులపై తన ఇంటి వద్ద లాఠీలతో దాడి(Lotty charge on Osmania Stundents) చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీపై గెలిచి, కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా పోటీ చేసిన దానంపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ ఇటు స్పీకర్‌కు, అటు హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.