రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి పాలన..ఆరు గ్యారంటీల అమలులో విఫలం : ఈటెల రాజేందర్

కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పాలన సాగిస్తోందని ఈటెల రాజేందర్ విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందని ఆరోపించారు.

Eatala Rajendar

విధాత ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పాలన కొనసాగిస్తోందని మాజీ మంత్రివర్యులు, మల్కాజి గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చిన “ఆరు గ్యారెంటీలు” అమలులో పూర్తిగా విఫలమైందని అన్నారు. శనివారం ఆయన వరంగల్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలను మోసం చేస్తూ కేవలం మాటలకే పరిమితమైన ప్రభుత్వం ఇదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అవినీతి పెరిగి, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను పక్కనపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తన స్వప్రయోజనాల కోసం పనిచేస్తోందని, వచ్చే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా అవినీతి జరుగుతోందని అన్నారు. అభివృద్ధి పనుల పేరుతో నిధుల దుర్వినియోగం జరుగుతుందని, స్థానిక ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికార పార్టీ నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రజల హక్కుల కోసం, అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. భూకామాంధులతో కుమ్మక్కు అయ్యి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ , మాజీ శాసనసభ్యులు తక్కెలపల్లి రాజేశ్వరరావు, వన్నాల శ్రీరాములు,బొడిగె శోభ, సీనియర్ నాయకులు ఎడ్ల అశోక్ రెడ్డి, వంగాల సమ్మిరెడ్డి, డాక్టర్ కాళి ప్రసాద్, రత్నం సతీష్ షా, జలగం రంజిత్, మల్లాడి తిరుపతిరెడ్డి, తాబేటి వెంకట్ గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

మీకు తెలుసా..? సీపీఆర్ మెషిన్స్ వచ్చేశాయ్ !
ఏపీ రాజధాని అమరావతి పేరుతో కొత్త మ్యాప్ !

Latest News