మహబూబాబాద్: గ్రోమోర్ సెంటర్‌పై రైతుల దాడి
యూరియా సరఫరా చేయలేదనే ఆగ్రహంతో మహబూబాబాద్‌లోని గ్రోమోర్ సెంటర్ పై గురువారం రైతులు దాడికి దిగారు. ఈ సెంటర్ తలుపులు పగులగొట్టి యూరియాను తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు

విధాత : యూరియా సరఫరా చేయలేదనే ఆగ్రహంతో మహబూబాబాద్‌లోని గ్రోమోర్ సెంటర్ పై గురువారం రైతులు దాడికి దిగారు. ఈ సెంటర్ తలుపులు పగులగొట్టి యూరియాను తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. యూరియా కోసం బుధవారమే తమ వద్ద నుంచి గ్రోమోర్ సెంటర్ సిబ్బంది ఆధార్ కార్డులు తీసుకుని గురువారం యూరియా ఇస్తామని చెప్పారని రైతులు అంటున్నారు. కానీ, గురువారం కూడా యూరియా సరఫరా చేయకపోవడంతో కోపంతో రైతులు గ్రోమోర్ సెంటర్ ముందు కర్రలతో నిప్పు పెట్టారు. తాళం వేసి ఉన్న గ్రోమోర్ సెంటర్ పై రాళ్లతో దాడికి దిగి తలుపు తాళం విరగ్గొట్టి గోడౌన్ లో ఉన్న యూరియా బస్తాలను తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రైతులకు యూరియా అందిందచేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే, ఆధార్ కార్డులు తీసుకున్నా యూరియా ఇవ్వకుండా సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.