సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన చత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్
చత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సచివాలంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన భూపేశ్ భగేల్‌కు రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటిలు పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు.

విధాత, హైదరాబాద్ : చత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సచివాలంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన భూపేశ్ భగేల్‌కు రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటిలు పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు. చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో భూపేశ్ భగేల్ ప్రభుత్వం అధికారం కోల్పోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాగా చత్తీస్‌గఢ్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం రాష్ట్రానికి రావడం కొంత ఆసక్తి రేపింది