ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు హాజరైన మావోయిస్టు మాజీ నేత దేవ్ జీ
40 ఏళ్ల తర్వాత చదువును తిరిగి ప్రారంభించిన మాజీ మావోయిస్టు నేత దేవ్ జీ కోరుట్లలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాయడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి బుధవారం జరిగిన ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ సెకండ్ ఇయర్ పరీక్షకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో దేవ్ జీ పరీక్ష రాశారు.
1984-85 విద్యా సంవత్సరంలో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన దేవ్ జీ.. ఆ తర్వాత విప్లవ భావజాలం వైపు ఆకర్షితులై మావోయిస్టు ఉద్యమంలో చేరి అజ్థాతంలోకి వెళ్లిపోయారు.ఫిబ్రవరి 2026లో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ అజ్ఞాత జీవితం తర్వాత తిరిగి చదువు వైపు ఆయన అడుగులు వేయడం విశేషం.
40 ఏళ్ల క్రితం ఎక్కడైతే చదువు ఆగిపోయిందో, మళ్లీ అదే ఊరిలో పరీక్ష రాయడం గమనార్హం. సాధారణ విద్యార్థులతో కలిసి ఆయన పరీక్ష రాస్తున్న తీరు చూసి తోటి వారు, అధికారులు ఆశ్చర్యపోయారు. లొంగిపోయిన తర్వాత చట్టపరమైన అంశాలను లోతుగా అధ్యయనం చేయడానికి ‘లా’ (Law) చదవాలని ఆయన ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్ అర్హత తప్పనిసరి కావడంతో, ప్రత్యేక అనుమతితో ఆయన ఈ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి :
హుజూర్ నగర్ లో మంచినీటి సౌకర్యాల కల్పనకు 1.50 కోట్లు : మంత్రి ఉత్తమ్
పశ్చిమాసియా సంక్షోభం వేళ…కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram