హుజూర్ నగర్ లో మంచినీటి సౌకర్యాల కల్పనకు 1.50 కోట్లు : మంత్రి ఉత్తమ్
హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 55 గ్రామాల్లో మంచినీటి సౌకర్యాల మెరుగుదలకు రూ.1.50 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో బోర్‌వెల్స్, పైప్‌లైన్లు, ట్యాంకుల మరమ్మతుల పనులకు ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు.
హుజూర్ నగర్ నియోజకవర్గంలో మరింతగా మంచినీటి సౌకర్యాల కల్పనకు 55 గ్రామాల్లో ఎస్డీఎఫ్(SDF) నిధులు రూ 1.50 కోట్లతో ప్రతి పాదనలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కి పంపినట్లు మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో అవసరమైన చోట్ల పంపు సెట్లు, బోర్ వెల్స్, పైప్ లైన్ ఏర్పాటు, పాత మంచినీటీ ట్యాంకులు(OHSR)ల రిపేర్లు తదితర పనులు చేపట్టానున్నట్లుగా తెలిపారు.
చింతల పాలెం మండలంలో 6 గ్రామాలకు రూ. 16 లక్షలు , హుజూర్ నగర్ మండలం లో 4 గ్రామాలకు రూ. 12.50 లక్షలు, నేరేడు చర్ల మండలం లో 6 గ్రామాలకు రూ. 13.50 లక్షలు, మఠంపల్లి మండలంలో 8 గ్రామాలకు రూ. 28.50 లక్షలు, గరిడేపల్లి మండలంలో 15 గ్రామాలకు రూ. 38.50 లక్షలు, పాలక వీడు మండలంలో 6 గ్రామాలకు రూ. 14 లక్షలు, మేళ్లచెర్వు మండలంలో 10 గ్రామాలకు రూ. 27 లక్షలతో ప్రతి పాదనలు పంపినట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి :
పశ్చిమాసియా సంక్షోభం వేళ…కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
I Bomma | టాలీవుడ్‌కు మళ్లీ పైరసీ ముప్పు.. తిరిగి యాక్టివ్ అయిన ‘ఐ బొమ్మ’, ‘బప్పం’ వెబ్‌సైట్లు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram