మెదక్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత, మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు పట్లోల్ల శశిధర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. శుక్రవారం మంత్రి హరీష్ రావు సమక్షంలో

- గులాబీ కండువా కప్పిన మంత్రి హరీష్ రావు

- పద్మా దేవేందర్ రెడ్డి హ్యాట్రిక్ ఖాయం

- కాంగ్రెస్ డబ్బు సంచులతో వస్తోందంటూ విమర్శలు

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత, మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు పట్లోల్ల శశిధర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. శుక్రవారం మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శశిధర్ రెడ్డి స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బు సంచులతో వస్తున్నారని, మెదక్ ప్రజల ఆత్మ గౌరవాన్ని కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. శశిధర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికతో పద్మా దేవేందర్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమైందన్నారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జిల్లా తెచ్చారని, ఘనపూర్ ప్రాజెక్టు కాలువల సిమెంట్ లైనింగ్, ప్రాజెక్టు ఎత్తు కోసం నిధులు తెచ్చి అభివృద్ధి చేశారన్నారు.

కాంగ్రెస్ కు కండ్లు లేవు... డబ్బున్న వారికే టికెట్

- మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి చెవులు మాత్రమే ఉన్నాయని, కళ్ళు లేవని మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ లో డబ్బులు ఉన్నవారికే టికెట్ ఇచ్చిందన్నారు. 9 సంవత్సరాలు కష్టపడ్డ తిరుపతిరెడ్డికి ఇవ్వకుండా, తనకూ ఇవ్వకుండా కొత్త వారికి టికెట్ ఇవ్వడం బాధ కలిగిందన్నారు. 12 మంది పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నామని, పది నిమిషాలైనా మమ్మల్ని పిలిచి అడగలేదని శశిధర్ రెడ్డి ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతి రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Vidhaatha Desk

Vidhaatha Desk

Next Story