Gajwel Street | గజ్వేల్​ గమ్మత్తు – ఒకే వీధికి ఆరు పేర్లు

గజ్వేల్‌లోని 25 ఇండ్ల కాలనీకి కుల విభేదాల కారణంగా ఒక్క రాత్రిలో ఆరు వేర్వేరు నేమ్ బోర్డులు వెలిసాయి. ఇది ప్రస్తుతం పట్టణంలో హాట్ టాపిక్.

  • Publish Date - September 16, 2025 / 05:18 PM IST

Gajwel Street | సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఓ చిన్న కాలనీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కేవలం 25 ఇండ్లతో ఉన్న ఈ కాలనీకి ఒకే పేరుండాలి కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఒక్క రాత్రిలోనే ఆరు వేర్వేరు పేర్లతో బోర్డులు పెట్టడం స్థానికుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.

మొదట్లో దీనిని వినాయక నగర్ కాలనీగా పిలిచేవారు. అయితే, ఇటీవల జరిగిన ఒక వివాదం కారణంగా కాలనీలో కుల ఆధారిత విభజనలు బహిర్గతమయ్యాయి.

గజ్వేల్ కాలనీకి వేర్వేరు బోర్డులు ఎలా వచ్చాయి?

One street, six names – Colony name dispute turns hot topic in Gajwel

ఈ కాలనీలో 70 శాతం మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. మిగతా 30 శాతం వివిధ కులాలకు చెందినవారు.  కుల విభేదాల వల్ల మెజారిటీ వర్గం వారు వినాయకనగర్​ బోర్డు పక్కన, తమ కులం పేరుతో బోర్డు పెట్టడంతో, మిగతా కులాలవారు కూడా ప్రతిగా తమ కులాల పేర్లతో బోర్డులు పెట్టారు.

దీంతో ఒక్క వీధికే 6 పేర్లు వెలిశాయి:

  • రెడ్డి ఎన్‌క్లేవ్
  • ఆర్యవైశ్య ఎన్‌క్లేవ్
  • ముదిరాజ్ ఎన్‌క్లేవ్
  • విశ్వకర్మ ఎన్‌క్లేవ్
  • యాదవ్స్ ఎన్‌క్లేవ్
  • వినాయక నగర్ కాలనీ (పాత పేరు)

ఒకే వీధికి ఆరు వేర్వేరు బోర్డులు ఉండటంతో స్థానికులు మాత్రమే కాదు, మొత్తం పట్టణం ఈ వ్యవహారాన్ని ఆశ్చర్యంగా గమనిస్తోంది.

చి25 ఇండ్ల చిన్న కాలనీ అయినా కుల విభేదాల కారణంగా ఇంత రచ్చ జరగడం, ఆరు పేర్లతో బోర్డులు పెట్టడం  గజ్వేల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఇలాగే ఉంటుందా లేక మరేదైనా మలుపు తీసుకుంటుందా అనేది పట్టణ ప్రజల్లో చర్చలకు దారితీసింది.