Hyderabad: సీఎం రేవంత్ గెటప్ వినాయకుడి విగ్రహం తొలగింపు
హైదరాబాద్‌లో సినీ సీఎం రేవంత్ గెటప్‌లో వినాయక విగ్రహం భక్తుల అభ్యంతరాల నేపథ్యంలో తొలగించబడింది, రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

విధాత, హైదరాబాద్ : వినాయక చవితి సందర్భంగా కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లోని వినాయక విగ్రహాన్ని భక్తుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాల నేపథ్యంలో నిర్వాహకులు తొలగించారు. రేవంత్ రెడ్డి రూపం విగ్రహం తొలగించి..మరో విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని సౌత్ వెస్ట్ డీసీపీ సూచించడంతో ఆ విగ్రహాన్ని తొలగించి..ఆ స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ వినాయకుడి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో ఏర్పాటు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ఏం దేవుడు కాదని.. ఇలాంటివి హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తాయని, ఆ విగ్రహాన్ని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ హైదరాబాద్ సీపీకి లేఖ రాశారు. ఈ పరిణమాల నేపథ్యంలో వివాదం మరింత ముదరకముందే పోలీసులు రేవంత్ గెటప్ వినాయక విగ్రహాన్ని తొలగించాలంటూ నిర్వాహకులకు సూచించడం..వారు విగ్రహాన్ని మార్చడం చకచకా జరిగిపోయాయి.