విధాత, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఓ జంట సయ్యాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ జంట రాసలీలల సయ్యాటకు ప్రభుత్వ కార్యాలయం వేదికవ్వడం విస్మయకరం. అయితే ఆ జంట ఓ పాముల జంట కావడం విశేషం. ఎప్పుడు వచ్చాయో..ఎక్కడి నుండి వచ్చాయో…ఎలా జీహెచ్ఎంసీ కార్యాలయంలో దూరిపోయాయోగాని, అవి పరస్పరం పెనవేసుకుని సయ్యాటకు దిగాయి.

ఆహ్లాదకరమైన వాతావరణానికి పరవశించిన పాముల జంట జీహెచ్ఎంసీ కార్యాయం ఆరుబయట పరస్పరం రాసలీలకు దిగిన అరుదైన దృశ్యం సిబ్బంది కంట పడింది. పాముల సయ్యాటను కార్యాలయం సిబ్బంది వీడియోలో బంధించారు. కొద్ధిసేపు సయ్యాట అనంతరం ఆ పాముల జంట సమీపంలోని గడ్డి పొదల్లోకి జారుకున్నాయి. పాముల సయ్యాట చూసిన కార్యాలయ సిబ్బంది..కార్యాలయం ఆవరణలో పాముల సంచారం వెలుగుచూడటంతో మళ్లీ అవి ఎప్పుడు ప్రత్యక్షమవుతాయోనంటూ హడలిపోతున్నారు.