Junior Assistants | జూనియర్ అసిస్టెంట్లకు తీపి కబురు.. సర్వీసు క్రమబద్దీకరణకు లైన్ క్లియర్
Junior Assistants | జూనియర్ అసిస్టెంట్ల సర్వీసు క్రమబద్దీకరణకు లైన్ క్లియర్ అయింది. సర్వీసు క్రమబద్దీకరణపై సీసీఎల్ఏ ఉన్నాతాధికారులు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్లకు మార్గదర్శకాలు
జేఏసీ వినతిపై స్పందించిన సీసీఎల్ఏ
Junior Assistants | హైదరాబాద్, అక్టోబర్11(విధాత): జూనియర్ అసిస్టెంట్ల సర్వీసు క్రమబద్దీకరణకు లైన్ క్లియర్ అయింది. సర్వీసు క్రమబద్దీకరణపై సీసీఎల్ఏ ఉన్నాతాధికారులు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జూనియర్ అసిస్టెంట్ల నియామకం జరిగి 2025 ఆగస్టు 9 నాటికి రెండు సంవత్సరాలు పూర్తయినది. కానీ వారి సర్వీసు క్రమబద్దీకరణపై స్పష్టత లేదు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి ఆద్వర్యంలో జూనియర్ అసిస్టెంట్ల సర్వీసును క్రమబద్దీకరించాలని టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ ప్రతినిధులు సీసీఎల్ఏ కమిషనర్‌కు వినితిపత్రం అందించారు.
అలాగే జిల్లాల కలెక్టర్లు కూడా సీసీఎల్ఏ కమిషనర్‌ను కోరారు. వీటిపై స్పందించిన సీసీఎల్ఏ కమిషనర్ జూనియర్ అసిస్టెంట్ల క్రమబద్దీకరణపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బదిలీ ద్వారా నియామకం అయిన జూనియర్ అసిస్టెంట్లు కేడర్ కు తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1996 యొక్క రూల్ నెం.16 (C) (ii) వర్తిస్తుందని తెలియజేశారు. బదిలీ ద్వారా నియామకం కాబడిన ఉద్యోగులకు ఒక సంవత్సరం ప్రొబేషన్‌లో ఉంటుందని కలెక్టర్లకు జారీ చేసిన ఆదేశాలలో స్పష్టంగా తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి, డీసీఏ జనరల్ సెక్రటరీ కెతావత్ రామకృష్ణ, టీజీటీఏ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, టీజీఆర్ఎస్ఏ అధ్యక్ష, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.బిక్షం సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్‌కుమార్ , సీసీఎల్ఏ సెక్రటరీ మంద మకరందులకు, సీసీఎల్ఏ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram