Phone Tapping Case| ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు అనుమతినివ్వాలని తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)కు సుప్రీంకోర్టులో(Supreme Court relief)ఊరట దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు అనుమతినివ్వాలని తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేత్రత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలను వినిపించారు.
గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసును సవాల్ చేస్తూ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. హరీష్ రావుపై నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు క్వాష్ చేసింది. హైకోర్టు తీర్పుపై చక్రధర్ గౌడ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చక్రధర్ గౌడ్ పిటిషన్ లోనే హరీష్ రావు విచారణకు అనుమతించాలని ఆశ్రయించింది. ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు తాము హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాలని వెల్లడించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram