Heavy Rains | హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం.. 2 గంటలు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Heavy Rains | భాగ్యనగరాన్ని భారీ వర్షం( Heavy Rains ) మరోసారి ముంచెత్తింది. హైదరాబాద్( Hyderabad ) నగరమంతా కుండపోత వర్షం కురుస్తుండడంతో.. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రెండు గంటల పాటు వాన దంచికొట్టే అవకాశం ఉంది.
హైదరాబాద్ : హైదరాబాద్( Hyderabad ) మహా నగరంలో మళ్లీ వాన దంచికొడుతుంది. నగరమంతా కుండపోత వర్షం( Downpour ) కురుస్తోంది. రాబోయే 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్( Telangana Weather man ) హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు.
ప్రస్తుతం తార్నాక, సికింద్రాబాద్, ముషీరాబాద్, రాంనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఓయూ, చిక్కడపల్లి, ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్డీకాపూల్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మెహిదీపట్నం, లంగర్‌హౌజ్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, సంతోష్‌నగర్, ఉప్పుగూడ, చార్మినార్, చాంద్రాయణగుట్టతో పాటు పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతుంది.
ఇప్పటికే బోడుప్పల్, మల్లాపూర్, నాచారం, ఈసీఐఎల్, దమ్మాయిగూడ, చర్లపల్లి, ఉప్పల్, నాగోల్, కాప్రా, ఎల్‌బీ నగర్, హయత్‌నగర్‌లో భారీ వర్షం కురిసింది. స్థానికంగా ఉన్న లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రహదారులపై మోకాలి లోతు వరకు వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram