Heavy Rains | ఇవాళ ఈ జిల్లాలకు భారీ వర్షసూచన..! ఎల్లో అలర్ట్ జారీ..!!
Heavy Rains | తెలంగాణ( Telangana )లో క్యుములోనింబస్ మేఘాలు దట్టంగా ఏర్పడడంతో.. కొద్ది సమయాల్లోనే భారీ వర్షాలు( Heavy Rains ) కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం( Hyderabad Meteorological Center ) పేర్కొంది.

Heavy Rains | హైదరాబాద్ : తెలంగాణ( Telangana )లో క్యుములోనింబస్ మేఘాలు దట్టంగా ఏర్పడడంతో.. కొద్ది సమయాల్లోనే భారీ వర్షాలు( Heavy Rains ) కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం( Hyderabad Meteorological Center ) పేర్కొంది. దీనికి తోడు ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
బుధవారం నాడు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్, వనపర్తి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసినట్టు పేర్కొంది. గత 24గంటల్లో అత్యధికంగా నల్లగొండ జిల్లా కనగల్‌లో 11.53 సెం.మీ, నిడమనూర్‌లో 8.41 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది.