Telangana CMO WhatsApp hack| షాకింగ్..తెలంగాణ సీఎంవో..మంత్రుల మీడియా వాట్సాప్ గ్రూప్ ల హ్యాకింగ్!
సైబర్ నేరగాళ్లు తెలంగాణ సీఎంవో వాట్సాప్ గ్రూప్ తో పాటు పలువురు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్ లను హ్యాక్ చేసిన ఘటన సంచలనంగా మారింది. ఎస్ బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేషన్ పేరుతో ప్రమాదకర ఏపీకే ఫైల్స్ ను వాటిలో సైబర్ నేరగాళ్లు షేర్ చేస్తున్నారు
విధాత, హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు( cyber criminals) తెలంగాణ సీఎంవో(Telangana CMO) వాట్సాప్ గ్రూప్ తో పాటు పలువురు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్(ministers WhatsApp media group) లను హ్యాక్(hacked) చేసిన ఘటన సంచలనంగా మారింది. ఎస్ బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేషన్ పేరుతో ప్రమాదకర ఏపీకే ఫైల్స్ ను వాటిలో సైబర్ నేరగాళ్లు షేర్ చేస్తున్నారు. ఆధార్ ఆప్డేషన్ చేసుకోవాలని సూచిస్తు..ఎస్ బీఐ పేరుతో మెస్సేజ్ లు పెడుతున్నారు.
సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న నకిలీ ఏపీకే(APk) ఫైల్స్ ఓపెన్ చేయవద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేసిన వారి వివరాలన్ని సైబర్ నేరగాళ్లకు చిక్కి..బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఏకంగా సీఎంవో, మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులను హ్యాకింగ్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
తాజాగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ కు గురైన సంగతి తెలిసిందే. కోర్టు ఆర్డర్ కాపీలు డౌన్ లోడ్ చేస్తుండగా గేమింగ్ సైట్ ఓపెన్ కావడంతో హైకోర్టు రిజిస్ట్రార్ ఈ వ్యవహరంపై తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఏకంగా సీఎంవో, మంత్రుల మీడియా వాట్సాప్ గ్రూపులు హ్యాకింగ్ కు గురికావడం సైబర్ క్రైమ్ విభాగానికి సవాల్ గా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram