లిఫ్టులో ఇరుక్కుని బాలుడి మృతి

లిఫ్టులో ఇరుక్కుని బాలుడి మృతి

విధాత : లిఫ్టులో ఇరుక్కుని అక్షయ్‌కుమార్ అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘ‌ట‌న‌ ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకున్న‌ది. అయితే త‌మ కుమారుడి మృత‌దేహాన్ని త‌మ‌కు చూపించ‌కుండా పోస్టుమార్టంకు తరలించారని బాలుడి త‌ల్లిదండ్రులు బిల్డింగ్ ఓనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆందోళ‌న‌కు దిగారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.