హైదరాబాద్ లో వెలుగులోకి లవ్ జిహాద్ !

హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడి లవ్ జిహాద్ బహిర్గతం… హిందూ యువతిని మతం మార్చి పెళ్లి చేసి అక్రమంగా 27 ఏళ్లుగా నివాసం!

హైదరాబాద్ లో వెలుగులోకి లవ్ జిహాద్ !

విధాత : హిందూ అమ్మాయిలను ప్రేమ పెళ్లి పేరుతో మత మార్పిడికి పాల్పడిన పాకిస్తాన్ యువకుడి లవ్ జిహాద్ వ్యవహారం హైదరాబాద్ లో వెలుగు చూసింది. పాకిస్తాన్ కు చెందిన ఫహాద్ అనే యువకుడు 1998లో పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో స్థిరపడ్డాడు. హిందూ యువతి కీర్తిని మతం మార్చి 2016లో ఫహద్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఆమె పేరును దోహా ఫాతిమాగా మార్చేశాడు. హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పని చేస్తుండగా కీర్తితో పహాద్ కు ఏర్పడిన పరిచయం వారి పెళ్లికి దారి తీసింది. కాగా ఫహాద్ కొన్నాళ్లుగా అదే కంపెనీలో పని చేసే మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఇటీవల పహాద్ ను కీర్తీ ఆ మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పోలీసులకు కీర్తి సమాచారం ఇవ్వడంతో ఫహద్ సహా ఆ మహిళను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో పహాద్ మోసాలు..అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి.

పాక్ పౌరుడిననే విషయం దాచి కీర్తికి ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి చేసుకోవడంతో పాటు 27 ఏళ్లుగా హైదరాబాద్‌లో అక్రమంగా పహాద్ కుటుంబం నివాసం ఉంటున్నట్లుగా పోలీసు విచారణలో తేలింది. భారతీయుడు కాకపోవడంతో అక్రమంగా ఆధార్‌ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డులను తయారు చేసుకున్నాడు. నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పహల్గామ్ ఘటన తర్వాత పలుమార్లు భర్త ఢిల్లీకి వెళ్లాడంటున్న బాధితురాలు కీర్తి వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. భర్త పహీద్, అత్త, ఇద్దరు మరిదిలు, ఆడపడుచు పాక్ నుంచి వచ్చి నగరంలో అక్రమంగా ఉంటున్నట్లుగా గుర్తించారు. దీంతో ఫహద్‌ను అదుపులోకి తీసుకుని లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి…

బనకచర్లకు కట్టుబడే ఉన్నాం : స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

మైనర్ బాలికపై హత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష