Hydreabad Roads | హైదరాబాద్ లో కుంగిన రోడ్డు..గుంతలో పడిన ట్యాంకర్
హైదరాబాద్‌లో కుండపోత వర్షాలకు రోడ్డులు కుంగిపోతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. బంజారాహిల్స్‌లో ఓ రోడ్డు కుంగిపోవడంతో ఓ వాటర్ ట్యాంకర్ డ్రైనేజీలు పడిపోయింది. డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి.
Hydreabad Roads | విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు..వరదలతో డ్రైనేజీలు పొంగి పొర్లి రోడ్లను వరద నీరు ముంచెత్తింది. దీంతో చాల ప్రాంతాల్లో రోడ్లన్ని జలమయమవ్వగా…కొన్ని చోట్ల వరద నీటిలో వాహనాలు కొట్టుకపోయాయి. బంజారాహిల్స్(Banjara Hills) లోని విరించి ఆసుపత్రి దగ్గర రోడ్డు కుంగిపోవడంతో ఏర్పడిన భారీ గుంతలో ఓ వాటర్ ట్యాంకర్(Water Tanker) పడిపోయిన ఘటన వైరల్ గా మారింది. రోడ్డు నంబర్ 1/12లో అకస్మాత్తుగా రోడ్డు కుంగడంతో అటుగా వస్తున్న నీటి ట్యాంకర్ అందులో పడిపోయింది.
ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్‌తోపాటు క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కుంగిన చోట రోడ్డు కింద నాలా పైప్‌లైన్ ఉన్నట్లు గుర్తించారు. రహదారి కుంగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాన్ని తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram