HYDRAA Bathukamma | కనికరం లేని రేవంత్ అంటూ.. కన్నీళ్లు పెట్టిన హైడ్రా బతుకమ్మ..!
తీరొక్క పువ్వులతో బతుకమ్మ( Bathukamma )ను పేర్చినట్టు.. పేద మహిళలు కాయకష్టం చేసి పైసా పైసా పోగేసి.. అప్పులు చేసి నిర్మించుకున్న ఇండ్లపైకి హైడ్రా( HYDRAA ) పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్( Revanth Reddy Govt ) బుల్డోజర్లను పంపిస్తోన్న సంగతి తెలిసిందే.

HYDRAA Bathukamma | తీరొక్క పువ్వులతో బతుకమ్మ( Bathukamma )ను పేర్చినట్టు.. పేద మహిళలు కాయకష్టం చేసి పైసా పైసా పోగేసి.. అప్పులు చేసి నిర్మించుకున్న ఇండ్లపైకి హైడ్రా( HYDRAA ) పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్( Revanth Reddy Govt ) బుల్డోజర్లను పంపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బతుకమ్మ పండుగ( Bathukamma Festival ) బతుకమ్మ పండుగలా లేదు. రేవంత్( Revanth ) సర్కార్‌కు వ్యతిరేకంగా బతుకమ్మ పాటలు( Bathukamma Songs ) వాడవాడలా దద్దరిల్లాయి. ఇక చివరి రోజైనా సద్దుల బతుకమ్మ నాడు.. బతుకమ్మ కన్నీరు పెట్టుకుంటూ ఇంటి నుంచి చెరువుల వైపు అడుగేసింది.
గతేడాది వరకు సంతోషంగా సాగనంపిన నన్ను.. ఈ ఏడాది దుఃఖం పెట్టుకుంటూ సాగనంపడం బాలేదంటూ.. బతుకమ్మ కూడా బోరుమంది. కళ్లల్లో నుంచి ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగుకుంటూ.. చెరువు( Pond ) వైపు పయనమైంది. మీ ఇండ్లపైకి బుల్డోజర్లను రానివ్వకుండా తన శక్తి మేర ప్రయత్నిస్తానని బతుకమ్మ భరోసా నింపింది. ఈ దసరా వేళ ఆ దుర్గా దేవి( Durga Devi ) అనుగ్రహం మీకు ఎల్లవేళల ఉండాలని, మీకు మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తానంటూ బతుకమ్మ వీడ్కోలు పలికింది.
హైడ్రా పేరిట పేదల ఇండ్ల కూల్చి వేతలను చూసి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా బతుకమ్మను పేర్చారు. ఈ బతుకమ్మను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem District ) రామవరం ప్రాంతానికి చెందిన కొయ్యడ వెంకన్న దంపతులు తీర్చిదిద్దారు. ప్రస్తుతం హైడ్రా బతుకమ్మ ఫొటోలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.