Icecream Ban In Villages | మా ఊరిలో ఐస్ క్రీమ్ అమ్మితే రూ. 5,000/- జరిమానా.!

పిల్లల ఆరోగ్యం దృష్ట్యా తెలంగాణలో పలు గ్రామాల్లో, కాలనీల్లో ఐస్ క్రీమ్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. మా గ్రామంలో, కాలనీలోకి ఐస్ క్రీమ్ బండ్లకు నో ఎంట్రీ అంటూ పల్లెల్లో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ‘‘మా ఊరిలోకి ఐస్‌క్రీం బండ్లు రాకూడదు.. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా విధిస్తాం’’ అనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Icecream Ban In Villages

విధాత : చిన్నా పెద్ద ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ లు సైతం కల్తీ..నాసిరకం పదార్ధాలతో తయారుచేస్తూ విక్రయిస్తుండటంతో వాటిని తిన్నవారు తీవ్ర అస్వస్థతల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పిల్లల ఆరోగ్యం దృష్ట్యా తెలంగాణలో పలు గ్రామాల్లో, కాలనీల్లో ఐస్ క్రీమ్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. మా గ్రామంలో, కాలనీలోకి ఐస్ క్రీమ్ బండ్లకు నో ఎంట్రీ అంటూ పల్లెల్లో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.

అంతేకాకుండా .. గ్రామ పంచాయతీ పాలకవర్గాల ఆధ్వర్యంలో ‘‘మా ఊరిలోకి ఐస్‌క్రీం బండ్లు రాకూడదు.. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా విధిస్తాం’’ అనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. గూడూరు, తాండ్రియాల, గంభీర్ పూర్, ధర్మారం గ్రామాల్లో తాజాగా ఐస్ క్రీమ్ అమ్మకాల నిషేధ ఫ్లెక్సీలు వెలియగా..మరిన్ని గ్రామాలు సైతం ఇదే బాటలో సాగుతుండటం ఆసక్తికరం.  తమ పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు గ్రామాల ప్రజలు వెల్లడిస్తున్నారు.

కొందరు ఐస్‌క్రీమ్ తయారీదారులు నాణ్యత లేని పదార్థాలతో ఐస్‌క్రీమ్ తయారు చేసి బండ్లలో అమ్మకాలు జరుపుతున్నారని వారు ఆందోళన వెలిబుచ్చారు. దీంతో చిన్నారులకు దంత, జీర్ణ సంబంధ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కల్తీ ఐస్‌క్రీమ్‌లతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

gold, silver price| పెరిగిన బంగారం… వెండి ధరలు ఢమాల్
Road Rage In Jaipur | స్కూటీని తాకిందని..బుల్లెట్ బైక్ పై యువతి దాడి!

Latest News