విధాత, వరంగల్ ప్రత్యేకప్రతినిధి: జనగామ జిల్లా వంగపల్లి క్రాస్ మధ్య హైదరాబాదు నుండి వరంగల్ వైపు వస్తున్న కారు ప్రమాదవశాత్తు ఆదివారం బోల్తా పడి పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న శ్రీకర్, జగన్లు క్షేమంగా చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు.
అదే సమయంలో ఆ మార్గం నుంచి హైదరాబాద్ వెళుతున్న కుసుమ జగదీష్ వెంటనే తన సిబ్బందితో ప్రమాద ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన కారును పరిశీలించి అందులో ఉన్న వారిని యోగక్షేమాలు తెలుసుకున్నారు.
తన హైదరాబాద్ ప్రయాణాన్ని రద్దు చేసుకుని.. వారికి ధైర్యం చెప్పి, అనంతరం వారిని క్షేమంగా అక్కడి నుండి తన వాహనంలో వరంగల్ హాస్పిట్‌కి దగ్గరుండి తీసుకొని వెళ్ళారు.